కేటీఆర్ సినిమాల్లోకి వస్తే చూడాలని ఉంది..ఆ హీరో పక్కన నటిస్తే సూపర్…
తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా ట్విట్టర్‌లో షేర్ చేసి అభిమానులతో పంచుకుంటారు. ఇటీవల కేటీఆర్ జిమ్ చేస్తున్న ఫోటో పోస్ట్ చేయగా అది వైరల్గా మారింది. ఆ పోస్ట్ చూసిన అభిమానులు తెగ కామెంట్లు పెడుతున్నారు. కేటీఆర్ అచ్చం హీరోలా ఉన్నాడంటూ తెగ పొగిడేస్తున్నారు. అంతేకాకుండా సినిమాలో రావాలని ఆహ్వానిస్తున్నారు. కేటీఆర్‌ని బిగ్ స్క్రీన్ పై చూడాలని ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా మహేష్ బాబు సినిమాలో నటించాలని సూచిస్తున్నారు. మహేష్ బాబు పక్కన మంచి క్యారెక్టర్ చేయాలని చెప్తున్నారు. మరికొందరైతే ఒక యాక్షన్ సినిమాలో హీరోగా నటించండి అంటూ కామెంట్లు పెడుతున్నారు. దీనిపై కేటీఆర్ ఏవిధంగా స్పందిస్తాడో చూడాలి మరి..
ఇక కేటీఆర్కు సినీ హీరోలతో సన్నిహిత సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. ప్రముఖ హీరోలందరితో ఆయన మంచి రిలేషన్ షిప్ మెంటైన్ చేస్తుంటారు. మహేష్ బాబు, రామ్‌చరణ్, చిరంజీవి వంటి హీరోలతో కేటీఆర్కు స్నేహం ఉన్న ఆయన స్వయంగా ప్రకటించారు. గతంలో భరత్ అనే సినిమా సమయంలో కేటీఆర్, మహేష్ బాబు కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.
#Rowing pic.twitter.com/22W4ssESBP
— KTR (@KTRTRS) December 23, 2022