రోడ్డు పక్కన టీ తాగిన కేటీఆర్.. ఇంత సింపుల్‌గా..
Nothing better hot chai when you’re exhausted; pit stop on my way back pic.twitter.com/auH3FiWPHA
— KTR (@KTRTRS) August 21, 2019
టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే చాలా సింపుల్‌గా ఉంటారు. అందరితో సరదాగా ముచ్చటిస్తూ ఓ కామన్ మ్యాన్‌లా వ్యవహరిస్తారు.ట్విట్టర్‌లోనూ ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటూ ఎవరికి ఏ సమస్య వచ్చిన వెంటనే స్పందించి పరిష్కరిస్తుంటారు. అలాంటి ఆయన మరోసారి తన సింప్లిసిటీని చాటుకున్నారు. బుధవారం తన నియోజకవర్గం సిరిసిల్ల పర్యటనకు వెళ్లిన ఆయన తిరుగు ప్రయాణంలో ఓ రోడ్డు పక్కనే ఉన్న చాయ్ హోటల్‌లో టీ తాగి సేద తీరారు.
గజ్వేల్ దగ్గరకు రాగానే తన కారును ఆపి నేరుగా హోటల్‌లోకి వెళ్లారు. కేటీఆర్ రావడం చూసి ముందుగా హోటల్ యజమాని ఆశ్చర్యపోయాడు. కేటీఆర్ అక్కడ టెబుల్ వద్ద కూర్చొని టీ అడిగాడు. వెంటనే అతడు సంతోషంగా తీసుకువచ్చి ఇచ్చాడు. ఆయనతో ఓ ఫొటో కూడా దిగారు. దీన్ని కేటీఆర్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆలసిన సమయంలో చాయ్ తాగితే… అంతకంటే కావాల్సింది ఏముందని రాశారు. కేటీఆర్ తన హోటల్‌కు రావడం ఎంతో సంతోషంగా ఉందని యజమాని ఆనందాన్ని వ్యక్తం చేశాడు.