కేంద్రంపై కేటీఆర్ ఫైర్.. తెలంగాణ ఊసే లేదు - MicTv.in - Telugu News
mictv telugu

కేంద్రంపై కేటీఆర్ ఫైర్.. తెలంగాణ ఊసే లేదు

April 20, 2022

03

కేంద్ర ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. విద్యా సంస్థల కేటాయింపుల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపిందని బుధవారం ఆయన ట్విటర్‌ వేదికగా ఆవేదన చెందారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రం విషయంలో వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని అన్నారు.

”మోదీ సర్కారు ఏడు ఐఏఎంలను దేశవ్యాప్తంగా మంజూరు చేసింది. తెలంగాణపై ఎందుకో వివక్ష చూపించింది. ఏడు ఐఐటీల్లో రాష్ట్రానికి ఒక్కటి కూడా దక్కకపోవడం శోచనీయం. మిగతా విద్యా సంస్థల కేటాయింపుల్లోనూ తెలంగాణ ఊసే లేదు. ఎఐటీలు 4, మెడికల్ కళాశాలలు 157, నవోదయాలు 84 వివిధ రాష్ట్రాలకు కేటాయించినప్పటికీ తెలంగాణకు చోటు ఇవ్వలేదు.

అంతేకాకుండా రాష్ట్రానికి గిరిజన విశ్వవిద్యాలయం ఇస్తామన్నా హామీని కేంద్రం మరచిపోయింది” అని కేటీఆర్ అన్నారు. రాష్ట్రానికి వచ్చిన సంప్రదాయ వైద్య కేంద్రం యథావిధిగా గుజరాత్‌కు తరలిపోయిందన్నారు. ఈ వైద్య కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు గతంలో కిషన్ రెడ్డి చేసిన ట్విట‌్‌ను కేటీఆర్ ప్రస్తావించారు.