కేటీఆర్ భారత భవిష్యత్ ప్రధాని - ఏంజెల్ ఇన్వెస్టర్ - MicTv.in - Telugu News
mictv telugu

కేటీఆర్ భారత భవిష్యత్ ప్రధాని – ఏంజెల్ ఇన్వెస్టర్

May 24, 2022

దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో తెలంగాణ మంత్రి కేటీఆర్ దూసుకుపోతున్నారు. ప్రపంచ స్థాయి కంపెనీలతో తెలంగాణలో ఉన్న అవకాశాలను వివరిస్తూ పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. రోజుకు దాదాపు రెండు ఒప్పందాలు చేస్తూ వాటి వివరాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు.

 

ఈసందర్భంగా కేటీఆర్ కార్యదక్షత, చొరవ, మాట్లాడే విధానం, తపనలను పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు కొనియాడుతున్నారు. ఈ క్రమంలో ఏంజెల్ ఇన్వెస్టర్ అయిన ఆశా జడేజా మొత్వానీ కేటీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. కేటీఆర్‌తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. ‘రాబోయే 20 ఏళ్లలో కేటీఆర్ భారత ప్రధాని అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కేటీఆర్‌లాగా స్పష్టత, విజన్, విషయాన్ని విడమరచి చెప్పే విధానం కలిగిన రాజకీయ నేతలను నేను ఇంతవరకూ చూడలేదు. దావోస్‌లో కేటీఆర్ బృందం రెచ్చిపోతోంది. వాళ్ల జోరు చూస్తుంటే సిలికాన్ వ్యాలీ ప్రారంభ దశ గుర్తుకు వస్తోంది’ అంటూ ఓ రేంజులో పొగిడింది. దీంతో ఈమె కామెంట్లు వైరల్‌గా మారాయి. కాగా, ఆశా జడేజా మొత్వానీ 2000లో సిలికాన్ వ్యాలీలో స్టార్టప్ కంపెనీ ప్రారంభించారు. ప్రపంచ వ్యాప్తంగా 200 కంపెనీలలో పెట్టుబడులు పెట్టారు. భారీగా వచ్చిన లాభాలతో పెద్ద ఎత్తున దాతృత్వ కార్యక్రమాలు చేపట్టారు.