కేటీఆర్ సెషన్ అదుర్స్.. ఫేస్‌బుక్‌లో 50 లక్షలు, యూట్యూబ్ లో 46 లక్షల వ్యూస్ - MicTv.in - Telugu News
mictv telugu

కేటీఆర్ సెషన్ అదుర్స్.. ఫేస్‌బుక్‌లో 50 లక్షలు, యూట్యూబ్ లో 46 లక్షల వ్యూస్

December 3, 2017

ఇటీవల హైదరాబాద్‌లో అట్టహాసంగా  ముగిసిన ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సులో అమెరికా అధినేత కూతురు ఇవాంకా ట్రంప్‌తో మంత్రి కేటీఆర్ కూడా చాలా వేదికల్లో కనిపించారు. చక్కని ప్రసంగాలతో ఆకట్టుకున్నారు. మహిళా పారిశ్రామికవేత్తల నైపుణ్యాలు అంశంపై జరిగిన ప్లీనరీకి సమన్వయకర్తగానూ వ్యవహరించారు. చందాకొచ్చర్, ఇవాంక తదితరులు పాల్గొన్న ఈ సెషన్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన లభించింది.దీన్ని ఫేక్‌బుక్‌లో 50 లక్షల మంది, యూట్యూబ్‌లో 46 లక్షల చూశారు. కేటీఆర్‌ తెలంగాణపై చేసిన ప్రసంగంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యధిక హిట్లు రాబట్టింది. పుణె, బెంగళూరు, చెన్నై, పుణె, గుర్గావ్‌లలో అత్యధికులు వాట్సప్‌లలోనూ ఈ సెషన్ వీడియోను వీక్షించారు. ఈ ప్లీనరీ సందర్భంగా ఐటీ అంటే ఇవాంకా ట్రంప్ అని కేటీఆర్ చమత్కరించడం తెలిసిందే.