ఢిల్లీలో హరీష్, కేటీఆర్ బిజీబిజీ - MicTv.in - Telugu News
mictv telugu

ఢిల్లీలో హరీష్, కేటీఆర్ బిజీబిజీ

September 7, 2017

తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ఐటీ-పంచాయతీ రాజ్ మంత్రి  కేటీఆర్ గురువారం ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు. తెలంగాణ సమస్యలు, డిమాండ్లను కేంద్ర మంత్రుల, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. హరీష్ రావు.. కేంద్ర రోడ్డు, జల రవాణా మంత్రి నితిన్ గడ్కారీతో సమావేశమై.. రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై చర్చించారు. కొత్త రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు విరివిగా సాయం చేయాలని కోరారు. మరోపక్క.. కేటీఆర్.. కేంద్ర వాణిజ్య మంత్రి సురేశ్ ప్రభుతో సమావేశమయ్యారు. తెలంగాణకు జీఎస్టీకి సంబంధించి కొన్ని వెసులుబాట్లు, కొత్త ప్రాజెక్టులకు సాయం వంటి అంశాలు వీరిమధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.