కేసీఆర్ లేకపోతే వారిద్దరూ రోడ్డెక్కి కొట్టుకుంటారు - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ లేకపోతే వారిద్దరూ రోడ్డెక్కి కొట్టుకుంటారు

February 6, 2018

తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులకు ఒకరంటే ఒకరికి పడదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కనుక లేకపోయుంటే వారిద్దరూ రోడ్డెక్కి కొట్టుకునే పరిస్థతి వస్తుందన్నారు. కోమటిరెడ్డి మంగళవారం మీడియాతో పలు అంశాలపై మాట్లాడారు.

 

టీఆర్ఎస్‌కు నాలుగు ఓట్లు ఏమైనా వస్తే అది కేవలం హరీశ్ రావు చలవవల్లేనని వ్యాఖ్యనించారు. ‘హరీశ్ అంటే కేటీఆర్‌కు పడదు. హరీశ్ ఇంట్లో జరిగిన ఫంక్షన్‌కు కేటీఆర్ ఉద్దేశపూర్వకంగానే హాజరు కాలేదు. బెంగళూరు వెళ్లి సినిమా చూసి వచ్చాడు..’ అని కోమటిరెడ్డి తెలిపారు.

తన అనుచరుడైన బొడ్డపల్లి శ్రీనివాస్ హత్యపై స్పందిస్తూ.. ఈ దారుణంలో మంత్రి జగదీశ్ రెడ్డి పాత్ర లేకపోతే దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. జగదీశ్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ఆరు నెలల తర్వాత అతడు చీప్ లిక్కర్ అమ్ముకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు.