కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై గతకొన్ని రోజులుగా కేటీఆర్‌తోపాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు తీవ్రంగా మండిపడుతున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా అన్ని శాఖల్లో కొరతలు ఏర్పడుతున్నాయి అని, వాటికి సంబంధించిన వివరాలను సోమవారం కేటీఆర్ ట్విటర్లో పోస్ట్ చేశారు. ”బీజేపీ పాలనలో బొగ్గు కొరత, కరోనా టైంలో ఆక్సిజన్ కొరత, పరిశ్రమలకు కరెంట్ కొరత, యువతకు ఉద్యోగాల కొరత, గ్రామాల్లో ఉపాధి కొరత, రాష్ట్రాలకిచ్చే నిధుల కొరత, ఈ అన్ని సమస్యలకు మూలం ప్రధాని మోదీకి విజన్ కొరత” అంటూ ఆయన పేర్కొన్నారు. బీజేపీ పాలన అద్భుతమంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు.
బీజేపీ పాలనలో *బొగ్గు కొరత*
కరోనా టైంలో *ఆక్సిజన్ కొరత*
పరిశ్రమలకు *కరెంట్ కొరత*
యువతకు *ఉద్యోగాల కొరత*
గ్రామాల్లో *ఉపాధి కొరత*
రాష్ట్రాలకిచ్చే *నిధుల కొరత*అన్ని సమస్యలకు మూలం PM
*మోడీకి విజన్ కొరత*NPA Govt’s amazing performance 👏 pic.twitter.com/N5oMBuVeDF
— KTR (@KTRTRS) May 2, 2022
మరోపక్క కేసీఆర్ తెలంగాణ రాష్ట్రమంటే బీజేపీకి చిన్నచూపు అని, రాష్ట్ర అభివృద్ది కోసం కేంద్రం ఏమాత్రం సహాయసహకారాలు అందించటం లేదని తీవ్రంగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా కేటీఆర్ ‘ఆదిపురుష్ సినిమా బీజేపీ పార్టీ సినిమా’ అని చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర నేత బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘నీ చరిత్ర, నీ అయ్యాచరిత్ర కలిపి ‘రజాకార్ ఫైల్స్‌గా’ సినిమాగా తీస్తా’ అని సవాల్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో గెలిచేది బీజేపీ పార్టీనే అని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో కేటీఆర్ మోదీ పాలనను విమర్శిస్తూ, ట్విట్ చేయడంతో చర్చనీయాంశంగా మారింది.