డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించిన కేటీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించిన కేటీఆర్

October 26, 2020

Telangana

తెలంగాణ పేదలకు సొంతింటి కల సాకారం దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.  జీహెచ్ఎంసీ పరిధిలో 1152 ఇళ్లను దసరా కానుకగా ఇచ్చారు. జియాగూడలో 840,కట్టెలమండిలో 120, గోడే కా కబర్‌లో192 అర్హులకు అందజేశారు. 

సామూహిక గృహాల ప్రారంభోత్సవంలో మేయర్‌ బొంతురామ్మోహన్‌, హోం మంత్రి మహమూద్‌ అలీ కలిసి పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఇండ్లను అందజేస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో రూ.18 వేల కోట్లతో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. పైరవీలకు తావులేకుండా ఇళ్ల కేటాయింపు ఉంటుందని అన్నారు. నేతలు కూడా ఎవరూ ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని సూచించారు. కాగా ఇళ్లు లేేని పేదలకు అన్ని హంగులతో డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని 2014 ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.