ఏపీపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. మీరే వెళ్లి చూడండి - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. మీరే వెళ్లి చూడండి

April 29, 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ”ఏపీలో పరిస్థితిపై నా మిత్రులు కొంతమంది చెప్పిన మాటలు మీకూ చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్ లేదు, నీళ్లు లేవు. రోడ్లన్నీ ధ్వంసమై ఉన్నాయి. అక్కడ పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. అక్కడ నివాసించే వారు వారి ఊరి నుంచి హైదరాబాద్‌కు వచ్చాకే ఊపిరి పీల్చుకుంటున్నామని మిత్రులు చెప్పారు’ అని కేటీఆర్ అన్నారు.

హైదరాబాద్‌లో క్రెడాయ్ హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..”కేసీఆర్ దక్షత, సమర్థతతో రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా చేశారు.  గృహాలు, వ్యవసాయం, పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. నేను చెప్పేది అతిశయోక్తి కాదు. పక్క రాష్ట్రం వెళ్లి మీరే చూడండి. అక్కడికి వెళ్లి చూసి వస్తే మీరే మమ్మల్ని అభినందిస్తారు. తెలంగాణ గురించి నేను డబ్బా కొట్టుకోవడం కాదు. కొన్ని మాటలంటే కొంత మందికి నచ్చకపోవచ్చు కానీ, అవే వాస్తవాలు” అని కేటీఆర్ ఏపీపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.