రెండో విడత మెట్రో నిర్మాణంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు - MicTv.in - Telugu News
mictv telugu

రెండో విడత మెట్రో నిర్మాణంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

November 25, 2022

హైదరాబాద్ రెండో విడత మెట్రోను పూర్తి చేసి తీరుతామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో మెట్రో విస్తరణపై దృష్టిసారిస్తామని తెలిపారు.
శిల్పా లే అవుట్‌ ఫ్లైఓవర్‌ను ప్రారంభోత్సవం సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. నగరం విస్తరిస్తున్నందున ప్రజారవాణాపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం సహకరించినా, సహకరించకపోయినా రెండో విడత మెట్రో విస్తరణను తెలంగాణ సర్కార్ పూర్తిచేస్తుందని హామీ ఇచ్చారు.

బీహెచ్‌ఈఎల్‌ నుంచి లక్డీకపూల్‌ వరకు 26 కిలోమీటర్లు, నాగోల్‌ నుంచి ఎల్‌బీనగర్‌ వరకు 5 కిలోమీటర్లు, మైండ్‌స్పేస్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ వరకు 32 కిలోమీటర్లు కొత్తగా మెట్రో నిర్మించనున్నట్లు వెల్లడించారు. అదే విధంగా రూ.200 కోట్లతో ఎంఎంటీఎస్ విస్తరణ చేపడతామని స్పష్టం చేశారు. ఇప్పటికే నిధులు కోసం ఆర్థిశాఖకు సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని కేటీఆర్ తెలిపారు.