KTR Is Future CM After CM KCR, Says Minister Srinivas Goud
mictv telugu

సీఎం కావాల్సిన అర్హతలన్నీ కేటీఆర్‌కు ఉన్నాయి.. మంత్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

October 19, 2022

KTR Is Future CM After CM KCR, Says Minister Srinivas Goud

తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తర్వాత తెలంగాణ కేటీఆరే సీఎం అవుతారని మంత్రి వెల్లడించారు. తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేటీఆరే అని స్పష్టం చేశారు. కేటీఆర్ కు సీఎం అయ్యేందుకు అన్ని అర్హతలున్నాయని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీఎం కేసీఆర్ బీజేపీని ఎదుర్కొనేందుకు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారని చెప్పారు. ఆ తర్వాత కేటీఆరే సీఎం అవుతారని స్పష్టం చేశారు. వందకు వంద శాతం రాష్ట్రానికి నెక్ట్స్ సీఎం కేటీఆరే అని..ఈ విషయాన్ని పార్టీలో ఎవరిని అడిగినా చెబుతారన్నారు.

మునుగోడును దత్తత తీసుకుంటానని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానంటూ మంత్రి కేటీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను శ్రీవాస్ గౌడ్ గుర్తు చేశారు. తెలంగాణకు కాబోయే సీఎం కేటీఆర్ అని, ఆయనకే ఆ దక్షత ఉందని తెలిపారు. కేసీఆర్ కుమారుడిగా కాదని, అన్ని అర్హతలున్న వ్యక్తిగానే కేటీఆర్ సీఎం అవుతారని వ్యాఖ్యానించారు. కేంద్రంలో మార్పులు తీసుకురావాలని కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని, ఆయన ప్రయత్నాలు పూర్తైతే కేటీఆర్ సీఎం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

కేటీఆర్ కాబోయే సీఎం అంటూ ప్రచారం చేయడంతో, ఆయన బాటలోనే మరికొందరు నేతలు కేటీఆర్ భవిష్యత్తు తెలంగాణ ముఖ్యమంత్రి అంటూ ప్రచారం చేస్తున్నారు. మునుగోడులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించటం మాత్రమే కాకుండా, మునుగోడు ఉప ఎన్నికల కీలక రాజకీయాలు చేస్తున్న మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి ఆయనే భవిష్యత్ ముఖ్యమంత్రి అని చేస్తున్న ప్రచారం ప్రస్తుతం మునుగోడులో ఆసక్తికరంగా మారింది.