నా లైఫ్‌లో నా కూతురే పవర్‌పుల్ ఉమన్ - MicTv.in - Telugu News
mictv telugu

నా లైఫ్‌లో నా కూతురే పవర్‌పుల్ ఉమన్

November 29, 2017

హైదరాబాద్‌లో జరుగుతున్న జీఈఎస్ సదస్సులో మహిళల సాధికారతపై విస్తృత చర్చలు నడుస్తున్నాయి. మహిళలకు చక్కని అవకాశాలు కల్పిస్తే సాధించలేనిది ఏదీ ఉందని వ్యాపారులు, రాజకీయ నాయకులు బల్లలు గుద్ది చెబుతున్నారు.

మహిళల పారిశ్రామిక నైపుణ్యాలపై అంశంపై ఇవాంకా ట్రంప్, చందా కొచ్చర్, చెర్రీ బ్లెయిర్ తదితరులతో జరిపిన ప్లీనరీకి సమన్వయకర్తగా వ్యవహరించారు ఐటీ మంత్రి కేటీఆర్. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘ఇవాంకా, చెర్రీ బ్లెయిర్, చందా కొచ్చర్‌లు శక్తిమంతమైన మహిళలు.. వారి విధానాలు, అనుభవాలను తెలుసుకోగలిగాను. కేపిటల్, కాన్ఫిడెన్స్, కెపాసిటీ బిల్డింగ్ అనేవి మహిళాపారిశ్రామిక వేత్తలకు కీలకమైనవి..’ అని అన్నారు.

ఈ సందర్భంగా విలేకరి.. ‘మీ జీవితంలో శక్తిమంతమైన మహిళ ఎవరు?’ అని అడగ్గా.. ‘నా జీవితంలో నా కూతురే శక్తిమంతమైన మహిళ’ అని అనేసి ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్లిపోయారు.