ఫోటోషాప్ తో పొలిటికల్ వార్..! - MicTv.in - Telugu News
mictv telugu

ఫోటోషాప్ తో పొలిటికల్ వార్..!

July 19, 2017

 

రాజకీయం అంటే మీ అందర్కి తెల్సేకదా…పబ్లిక్కు మనం ఏం జేస్తుమన్నది ముఖ్యం గాదు,అవుతలోల్ల పార్టీల మీద నాల్గు దోసిళ్ల దుమ్మెత్తి పొయ్యాలె,అవుతల పార్టోల్లు ఒక్క డైలాగ్ ఏస్తే..మనం నాల్గు డైలాగులు కౌంటర్ కింద ఎయ్యాలే,ప్రెస్ మీట్లు వెట్టి,మీటింగులు వెట్టి అవుతల పార్టోల్లను కడ్గి పారెయ్యాలే…అప్పుడే అసలైన రాజకీయ నాయకులు అన్పించుకుంటరు,కనీ ఇప్పుడు రాజకీయం కొత్తపుంతలు తొక్కింది,అవుతల పార్టోల్లను బద్నాం జేశుట్ల కొత్త దారులు కన్కున్నరు రాజకీయ నాయకులు,ఇగో ఈ పేపర్లల్ల అచ్చిన వార్తలను జూడున్రి…పోట్వలే తేడా మ్యాటర్ అయితే ఒక్కటే..వెంకయ్య నాయుడుని ఉప రాష్ట్రపతిని  చెయ్యుమని నేనంటే నేను జెప్పిన అని ఓ పేపర్ల కెటిఆర్.

 

ఇంకో పేపర్ల లోకేష్,ఇంకో పేపర్ల జగన్  ముగ్గురు జెప్పినట్టు వార్త క్రియేట్ జేశిన్రు, అంటే అవుతలోల్లను బద్నాం జెయ్యనీకి  ఒక్కపార్టికి సంభందించినోళ్లు  మ్యాటర్ను తయారు జేశి  సోషల్ మీడియాలకు ఎక్కిస్తే…అదే మ్యాటరు మీద  ఫోట్వలను మార్చి మిగతా పార్టీకి సంభందించినోళ్లు  గుడ గదే పనిజేశిన్రన్నట్టు,ఇగ సోషల్ మీడియాల ఇవి జూశినోళ్లు ఇండ్ల ఏది నిజమో ఏది అబద్దమో తెల్వక కొందరు నెత్తులు గోక్కుంటున్రట, ఇదివర్కైతె  ప్రెస్ మీట్లు వెట్టి,అవుతలోల్ల పార్టీల మీద దుమ్మెత్తి పోసుడు,ఆళ్లు జరంత ఏదన్న అటీటు మాట్లాడినా ఏదన్న చెయ్యకూడని పనిజేశ్న సాలు,అబ్బ దొర్కిందిరా సందు అని మైకుల మూగవొయ్యేదాక మొత్తుకునెటోళ్లు.. ఇప్పుడేమో గిట్ల  ఫేక్ న్యూస్ క్రియేట్లు జేశి  రాజకీయంల అప్డేట్ అయితున్రన్నట్టు,మీరు అప్డేట్ అయితున్రు కరక్టే కనీ  పబ్లిక్కును ఎందుకు సార్లు ఉట్టిగనే కన్ఫ్యూజ్ జేశి  పర్శాన్ జేస్తున్రు.