మాది థర్డ్ ఫ్రంట్ కాదు ఫస్ట్ ఫ్రంట్.. కేటీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

మాది థర్డ్ ఫ్రంట్ కాదు ఫస్ట్ ఫ్రంట్.. కేటీఆర్

March 10, 2018

ఈ దేశం కేవలం కాంగ్రెస్, బీజేపీలది కాదన్న తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ నేత కేటీఆర్ ఈ అంశంపై మళ్లీ స్పందించారు. తన తండ్రి, సీఎం కేసీఆర్ ప్రకటించిన థర్డ్ ఫ్రంట్ నిజానికి ఫస్ట్ ఫ్రంట్ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీలు ఈ దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంతో ఘోరంగా విఫలం అయ్యాయని ఆయన శనివారం మండిపడ్డారు. వచ్చే సార్వత్రిక  ఎన్నికల్లో వాటిలో దేనికీ పూర్తి మెజారిటీ రాదని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీల్లో దేనికీ సంపూర్ణ మెజార్టీ రాని నేపథ్యంలో ఏర్పడే ప్రత్యామ్నాయ కూటమిని థర్డ్‌ ఫ్రంట్ అని కాకుండా ఫస్ట్‌ ఫ్రంట్ అని అనాలి.

ఈ దేశ రాజకీయ వ్యవస్థ.. రెండు పార్టీల మధ్య పోరాటానికి పరిమితం కాకూడదు. మాది థర్డ్‌ ఫ్రంట్ కాదు.. ఫస్ట్ ఫ్రంట్‌. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి నుంచి చాలా పార్టీలు విసుగెత్తి బయటికి వస్తున్నాయి. టీడీపీ, శివసేన వెళ్లిపోయాక ఎన్డీఏలో కేవలం బలహీనమైన అకాలీదళ్ మాత్రమే ఉంది.. ఇప్పటికైనా ఎన్డీఏ కూటమి  ఆత్మవిమర్శ చేసుకోవాలి.. అలాగే ప్రాంతీయ పార్టీలు మరింత బలపడాలి’ అని ఆయన అన్నారు.

కేంద్రం నుంచి తెలంగాణకు అదనంగా ఒక్క రూపాయి కూడా రాలేదని ఆయన ఆరోపించారు.