హైదరాబాద్‌లో మరో ఫ్లై ఓవర్‌‌ ప్రారంభం - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో మరో ఫ్లై ఓవర్‌‌ ప్రారంభం

November 25, 2022

హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలను తొలగించేందుకు తెలంగాణ సర్కార్ కృషి చేస్తోంది. దీని కోసం నగర వ్యాప్తంగా ఫ్లైఓవర్‌‌ల నిర్మాణం చేపట్టి వాహనదారులకు అందిస్తుంది. తాజాగా మరో ఫ్లైఓవర్‌ నగరవాసులకు అందుబాటులోకి వచ్చింది. శిల్పా లే అవుట్ ఫ్లైఓవర్‌‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఐటీ కారిడార్‌ను ఓఆర్ఆర్‌తో అనుసంధానం చేస్తూ రూ. 250 కోట్ల వ్యయంతో ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించారు. ఐకియా మాల్ వెనుక నుంచి నిర్మించిన ఈ వంతెన ఓఆర్ఆర్‌పైకి చేరనున్నది.

956 మీటర్ల పొడవు, 16.6 మీటర్ల వెడల్పుతో నాలుగు వరుసల రోడ్డుతో వంతెనను నిర్మించారు. శిల్పా లే అవుట్ నుండి గచ్చిబౌలి జంక్షన్, ఔటర్ రింగ్ రోడ్ వరకు ప్రయాణించే ప్రయాణికులకు కొంత మేర ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. గత ఆరేళ్లలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పూర్తి చేసిన 17వ ప్రాజెక్ట్ ఇది. భవిష్యత్తులో మరిన్ని ఫ్లైఓవర్‌లు అందుబాటులోకి రానున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.