తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ సోమవారం ముంబైలో రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ తో సమావేశమయ్యారు.
Met with Governor of RBI Sri Urjit Patel & discussed MSME sector issues, IHC and reconstituting SLIC. Also presented a Handloom Stole pic.twitter.com/ER3qX03BzG
— KTR (@KTRTRS) September 4, 2017
చిన్న, సూక్ష్మ, మధ్య తరహాల పరిశ్రమలు, ఇండస్ట్రియల్ హెల్త్ పాలసీ తదితర అంశాలపై చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలోని సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమలు సమస్యలపైన వాటి బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపైనా సవివరమైన లేఖను అందజేశారు. దాదాపు గంట సేపు జరిగిన ఈ సమావేశంలో చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి కోసం ఆర్బీఐ నుంచి కావాల్సిన మద్దతు పైన మంత్రి వివరించారు. భారత దేశ ఆర్థిక వ్యవస్థలో చిన్నతరహా పరిశ్రమల పారిశ్రామికోత్పత్తి 45 శాతం ఉందని, మొత్తం 40 శాతం ఎగుమతులు చిన్నతరహా పరిశ్రమల నుంచే వస్తున్నాయని మంత్రి తెలిపారు. చిన్నతరహా పరిశ్రమలతో లక్షలాది మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని ఇలాంటి రంగానికి కేంద్ర బ్యాంకు సహకారం అవసరమని తెలిపారు. అయితే ప్రస్తుతం దేశంలో ఉన్న బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి ఆశించిన మేర చిన్నతరహా పరిశ్రమలకు సహకారం లభించడం లేదన్నారు. చాలా సందర్భాల్లో ఇవి చిన్న తరహా పరిశ్రమలకు సిక్ పరిశ్రమలుగా గుర్తించి వేలం వేయడం జరుగుతుందని తెలిపారు. చిన్న తరహా పరిశ్రమలను ఏన్పీఏలు(NPA)గా గుర్తించడంలో ఆర్బీఐ ఇచ్చిన techno viablility study, కనీస 17 నెలల గడువు వంటి మార్గదర్శకాలను చాలా సందర్భాల్లో ఉల్లంఘిస్తున్నయని మంత్రి గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా జమ్మికుంట పట్టణంలోని ఒక ప్రభుత్వ బ్యాంకు అక్కడి చిన్న తరహా పరిశ్రమను NPA గా గుర్తించిన 15రోజుల్లోనే వేలం వేసిన విషయాన్ని మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. చిన్నతరహా పరిశ్రమల బకాయిల విషయంలో నిర్ణయం తీసుకునేందుకు జిల్లా స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని RBI మార్గదర్శకాలను చాలా బ్యాంకులు పట్టించుకోవడం లేదన్నారు. ఇదే విధంగా స్టేట్ లెవల్ ఇంటర్ ఇన్స్టిట్యూషనల్ కమీటీ పునర్వవ్యవస్ధీకరణ చేయాలన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో సుమారు 69,120 గుర్తింపు పొందిన సూక్ష్మ మరియు చిన్నతరహా పరిశ్రమలున్నాయని, ఇందులో సుమారు 8,618 సిక్ యూనిట్లుగా గుర్తించబడ్డాయని తెలిపారు. ఈ సమస్యను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ పేరిట ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేపట్టిందని, ఇందుకోసం సుమారు వంద కోట్లతో కార్పస్ ఫండ్ ఎర్పాటు చేసిందని తెలిపారు. ఈ హెల్త్ క్లినిక్ ల ద్వారా చిన్న తరహా పరిశ్రమలకు ప్రభుత్వంలోని వివిధ శాఖల తాలుకు సహకారంతో పాటు, వివిధ ఆర్థిక సంస్థల నుంచి అందవలసిన అర్ధిక సహకారం అందించే దిశగా పనిచేస్తుందని తెలిపారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్‌ను ప్రత్యేక అర్ధిక సంస్ధ(NBfC) గా గుర్తించేందుకు అవసరమైన సహాయ, సహకారాలను ఆర్బీఐ అందించాలని మంత్రి కోరడం జరిగింది.
ఉర్జిత్ పటేల్ తో భేటీకి ముందు కేటీఆర్ ఐసీఐసీఐ బ్యాంకు సీఈఓ చందా కొచ్చర్ తో అయ్యారు. తెలంగాణ ఇండస్ర్టియల్ హెల్త్ క్లినిక్, వుమెన్ ఎంట్రప్రెన్యూర్ షిప్, డిజిటల్ ఇనీషియేటివ్స్ పై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న టిఫండ్ లో భాగస్వాములు కావాలని కోరారు. తర్వాత మంత్రి పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం అయ్యారు. జేయస్ డబ్యూ గ్రూప్ చైర్మన్ మరియు యండి సజ్జన్ జిందాల్ తో సమావేశం అయ్యి, తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఈ సమావేశం తర్వతా మంత్రి పైన సజ్జన్ జిందాల్ ప్రసంశల వర్షం కురిపించారు. తెలంగాణ అభివృద్ది పట్ల మంత్రికి ఉన్న విజన్ కు అభినందనలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి పట్ల మంత్రి కెటి రామారావుకు ఉన్న నిబద్ధత, అలోచనలు ఇతర రాజకీయ నాయకులకు కూడా ఉంటే దేశం మరింత ఉన్నత శిఖరాలకు చేరుతుందని ట్వీట్ చేశారు. తర్వతా లూపిన్ యండి నీలేష్ గుప్తతో సమావేశం అయిన మంత్రి తెలంగాణ ఫార్మసిటీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. సాయంత్రం జరిగిన వార్షిక గ్లోబల్ పెట్టుబడిదారుల సమావేశంలో “ స్టార్ట్ అప్ స్టేట్ గా మూడేళ్ల తెలంగాణ ప్రయాణం” అనే అంశంపైన మంత్రి ప్రసంగించారు. తాము ఒక స్టార్ట్ అప్ కంపెనీలాగా ఉన్నతమైన నిబద్ధత, పట్టుదలతో రాష్ర్టంలో పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేస్తున్నామని, తాము రూపొందించిన పారిశ్రామిక పాలసీ, ఇతర పాలసీలకు ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రసంశలు లభిస్తున్నాయన్నారు. ఒక వైపు సంక్షేమం, మరోపైపు అభివృద్ది, పెట్టుబడుల సేకరణ వంటి బహుముఖ లక్ష్యాలతో ముందుకు పొతున్నామని తెలిపారు.