మత రాజకీయాలతో బీజేపీ దేశాన్ని వెనక్కి తీసుకుపోతోందని తెలంగాణ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. దేవుళ్ల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని, ఆవులు గోవులు వివాదాలు తప్ప దేశానికి చేసిందేమీ లేదని దుమ్మెత్తిపోశారు. కులమతాల పేరుతో పంచాయితీ పెట్టుకోవాలని ఏ దేవుడూ చెప్పలేదన్నారు. ఆయన శనివారం ఖమ్మంలో లకారం చెరువుపై నిర్మించిన కేబుల్ వంతెనను మంత్రి పువ్వాడ అజయ్‌తో కలిసి ప్రారంభించి ప్రసంగించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారని కేటీఆర్ కొనియాడారు. ‘కేసీఆర్ పేరులోని కే అంటే కాలువలు, సీ అంటే చెరువులు, ఆర్ అంటే రిజర్వాయర్లు. ఖమ్మంలో ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. మురికి కూపంలా ఉండిన లకారం చెరువును అందంగా తీర్చిదిద్దింది..’ అని అన్నారు. దేశ రాజకీయాలపై మాట్లాడుతూ.. ‘1987లో మనదేశ ఆర్థిక వ్యవస్థ, చైనా ఆర్థిక వ్యవస్థ సమానంగా ఉండేవి. కానీ చేతగాని ప్రభుత్వాల వల్ల భారత్ ఆర్థిక వ్యవస్థ కేవలం 3 ట్రిలియన్ల డాలర్లుగానే ఉండగా, చైనా 16 ట్రిలియన్ డాలర్లతో దూసుకుపోతోంది’ అని చెప్పారు.
Ktr new definition to Kcr name Telangana chief minister
Ktr, new definition, Kcr name, canals, tanks, reservoirs, Telangana