ktr old bike tweet
mictv telugu

29 ఏళ్ల నుంచి నడుస్తున్న కేటీఆర్ బైక్..

November 6, 2022

సోషల్ మీడియా వేదికగా తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఓ ఆసక్తికర సన్నివేశాన్ని పంచుకున్నారు. విద్యార్థిగా ఉన్న సమయంలో నిజాం కళాశాలలో తాను నడిపిన బైక్ ఇప్పటికీ చెక్కు చెదరలేదని, 29 ఏళ్లు గడిచినా ఆ బైక్ ఇంకా మంచి కండిషన్ లోనే ఉందంటూ కేటీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జాన్సన్ అనే వ్యక్తి చేసిన ఈ బైక్ పోస్ట్‌కు కేటీఆర్ రిప్లై ఇచ్చారు. తాను వాడిన బైక్‌ను చూసి సంబరపడిపోయారు..దానిని జాగ్రత్తగా చూసుకుంటున్న జాన్సన్ వ్యక్తికి ధన్యవాదాలు తెలిపారు.

 

1990 శకంలో సుజుకీ సమురాయ్‌ బైక్‌కి ఉన్న క్రేజ్ వేరు. దాని సౌండ్‌కి యువత ఫిదా అయిపోయేవారు. అట్లాంటి క్రేజీ బైక్‌నే కేటీఆర్ కూడా వాడినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ బైక్‌ను జాన్సన్ వాడుతున్నాడు. 24 ఏళ్ల క్రితం కేటీఆర్ నుంచి తీసుకున్న ఈ బైక్‌ను తాను ఇప్పటికీ వాడుతున్నానని జాన్సన్ తెలిపాడు. అంతేకాకుండా గతంలో కేటీఆర్‌తో కలిసి ఈ బైక్ నడిపిన రీతిలో ఇప్పుడు కూడా కేటీఆర్‌తో కలిసి బైక్‌పై తిరగాలని ఉందంటూ తన పోస్టులో తెలిపాడు. ఈ పోస్ట్‌ను చూసినవెంటనే కేటీఆర్ స్పందించారు.