Home > Featured > వారంలో 60 వేల డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి మార్గదర్శకాలు : కేటీఆర్

వారంలో 60 వేల డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి మార్గదర్శకాలు : కేటీఆర్

హైదరాబాదు నగరంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్లపై కేటీఆర్ సోమవారం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. లక్ష ఇళ్లలో భాగంగా ఇప్పటికే 60 వేల ఇళ్లు పూర్తయిన నేపథ్యంలో అర్హులైన లబ్దిదారులకు మార్గదర్శకాలను వారంలో తయారు చేయాలని ఆదేశించారు.

డబుల్ బెడ్రూం ఇళ్లపై మంత్రి సమీక్ష నిర్వహించగా, ఖచ్చితంగా ఇళ్లు లేని వారికే ఇళ్లు దక్కేలా తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మార్గదర్శకాలను రూపొందించే క్రమంలో గతంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వేను ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు. లబ్దిదారుల గుర్తింపు, క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ కోసం పెద్ద ఎత్తున బృందాలను నియమించాలన్నారు. వారంలోగా మళ్లీ సమీక్ష చేద్దామని, ఆ లోగా ఇళ్ల పంపిణీకి సమగ్ర మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించారు. కాగా, మిగిలిన 40 వేల ఇళ్ల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి.

Updated : 4 July 2022 9:25 AM GMT
Tags:    
Next Story
Share it
Top