ప్రాసలతో పరేషాన్ చేస్తున్న కేటిఆర్ ! - MicTv.in - Telugu News
mictv telugu

ప్రాసలతో పరేషాన్ చేస్తున్న కేటిఆర్ !

August 2, 2017

కాంగ్రెస్, టీఆర్ఎస్ ల మధ్య హాట్ హాట్ వాతావరణం నెలకొని వుంది. కేటిఆర్ ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తిట్ల దండకాన్ని ప్రారంభించింది. సిరిసిల్ల నీ సొంత జాగీరు కాదని కాంగ్రెస్ పార్టీ తమదైన శైలిలో కెటిఆర్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేసాయి. ఇసుక మాఫియాకి బినామీగా తన సొంత వారిని కేటిఆర్ నియమించాడని కాగ్రెస్ పార్టీ ప్రధాన ఆరోపణ. సిరిసిల్లాలో దళితుల మీద దాడి ఘటనను బేస్ చేస్కొని కేటిఆర్ ను కార్నర్ చెయ్యడానికి విశ్వ ప్రయత్నం చేసింది కాంగ్రెస్. మాజీ లోక్ సభ స్పీకర్ మీరా కుమారీ లాంటి వారిని కూడా సిరిసిల్లలో దించారు. వీటన్నింటినీ బేఖాతరు చేస్తూ కేటిఆర్ తనదైన పంచులతో కాంగ్రెస్ కు కౌంటర్లు వేస్తున్నారు.

కాంగ్రెస్ అంటే స్కాంగ్రెస్ అంటూ మాటల ఛమత్కారాలను వదులుతున్నారు. లూట్ – జూట్ – స్కూట్ ఇదీ కాంగ్రెస్ నైజమని ఓ కొత్త సిద్ధాంతాన్ని ప్రజల మీదకు వదిలాడు కేటిఆర్. మానేరులో మీరు నెత్తురు పారిస్తే మేము నీరు పారించామంటూ కాంగ్రెస్ విమర్శలకు కట్టె కొట్టె తెచ్చె అన్నట్టుగా సమాధానాలిచ్చాడు కేటిఆర్. మోతీలాల్ నెహ్రూ గారి కొడుకు జవహార్ లాల్ నెహ్రూ గారి కూతురు ఇందిరా గాంధీ గారి కొడుకు రాజీవ్ గాంధీ గారి భార్య సోనియా గాంధీ అధ్యక్షురాలిగా, వారి కొడుకు ఉపాధ్యక్షులుగా వున్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నామీద విమర్శించడమా ? అంటూ తనదైన స్టైల్లో ప్రాసలతో విరుచుకు పడ్డారు కేటిఆర్.