గవర్నర్ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందన.. పంచాయితే లేదు - MicTv.in - Telugu News
mictv telugu

గవర్నర్ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందన.. పంచాయితే లేదు

April 7, 2022

nnfgn

తెలంగాణలో తనకు అవమానం జరుగుతుందంటూ గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. గవర్నర్ అంటే తమకు గౌరవం ఉందని, తమిళిసైతో తమకు ఎలాంటి పంచాయితీ లేదని స్పష్టం చేశారు. ఆమెను ఎక్కడా అవమానించలేదని, ఎక్కడ అవమానం జరిగిందో ఆమె చెప్పాలన్నారు. అనవసరంగా తనకు తానే ఏదో ఊహించుకుంటున్నారని తెలిపారు. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ విషయంలో గవర్నర్ కావాలనే ఇబ్బంది పెట్టారు. రాజకీయ నేపథ్యం ఉన్నవాళ్లు ఎమ్మెల్సీ కాకూడదా? గవర్నర్ కాకముందు తమిళిసై గారు తమిళనాడు బీజేపీ అధ్యక్షులుగా చేయలేదా? అని ప్రశ్నించారు. గతంలో ఉన్న గవర్నర్ నరసింహన్‌తో తమకు ఎలాంటి సమస్య రాలేదన్నారు. అప్పుడు లేని పంచాయితీలు ఇప్పుడెందుకు వస్తున్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు.