కాంగ్రెస్‌ది కుటుంబ పాలన కాదా? - MicTv.in - Telugu News
mictv telugu

కాంగ్రెస్‌ది కుటుంబ పాలన కాదా?

November 1, 2017

కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుంటోందంటూ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. టీడీపీని వదలి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న రేవంత్.. కుటుంబ పాలన గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.కాంగ్రెస్‌లో సాగుతున్నది కుటుంబ పాలన కాదా? టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, ఆయన భార్య పద్మావతి ఎమ్మెల్యేలు కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కుంభకోణాల పార్టీని అని, ఇప్పుడు అందులో మరో దొంగ చేరాడని రేవంత్ ను ఉద్దేశించి అన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆరే సీఎం అవుతారని, ఈ సంగతి నరేంద్ర మోదీ, సోనియాగాంధీలకు కూడా తెలుసని అన్నారు. ‘ఓటుకు కోట్లు కేసులో రేవంత్‌ తెలంగాణ పరువు తీశాడు.  రాహుల్‌ గాంధీనే మమ్మల్ని ఏం చేయలేకపోయాడు. రేవంత్‌ ఎంత?  తెలంగాణ ఉద్యమంలో రేవంత్ పాల్గొన్నాడా?. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఈసారి కొడంగల్‌లో టీఆర్‌ఎస్ గెలుపుఖాయం’ అని తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో అన్నారు.