అమెరికా కంటే మనమే బెటర్ కదా.. కేటీఆర్ ఫోటో వెనుక కథ - MicTv.in - Telugu News
mictv telugu

అమెరికా కంటే మనమే బెటర్ కదా.. కేటీఆర్ ఫోటో వెనుక కథ

March 26, 2022

తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి మంత్రి కేటీఆర్ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ పార్మా కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి కొంచెం గ్యాప్ దొరకడంతో న్యూయార్క్ వీధుల్లో కాసేపు సరదాగా తిరిగారు. ఈ క్రమంలో ఓ వీధిలో ఉన్న ఫుడ్ స్టాల్‌ వద్ద ఆగి చికెన్, రైస్, సాస్‌లను కొని వాటి రుచి చూశారు. అనంతరం ఆ ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, ఆ ఫోటోలను గమనిస్తే గనక, ఆయా దుకాణాల్లో ‘క్యాష్ ఓన్లీ’ అనే బోర్డులు దర్శనమిస్తాయి. అంటే అక్కడ కేవలం నగదు చెల్లింపులు మాత్రమే అంగీకరించబడతాయి అని అర్ధం. అంటే అభివృద్ధి చెందిన అమెరికాలోని ప్రఖ్యాత న్యూయార్క్ నగరంలో ఇంకా నగదు చెల్లింపులే చేస్తున్నారా? అనే అనుమానం వస్తోంది. మన దగ్గర టీ, బిస్కెట్లు, సిగరెట్లు వంటి చిన్నచిన్న చెల్లింపులనే డిజిటల్ రూపంలో చేస్తున్నాము. నగరమైనా, పల్లెటూరు అయినా డిజిటల్ చెల్లింపులు మన వద్ద సాధారణమైపోయింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు ఇదే విషయాన్ని చర్చించుకుంటున్నారు. ఫోటో వెనుక స్టోరీ అంటూ క్యాప్షన్లు పెడుతున్నారు. కాగా, ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో ఇండియాలో ఎక్కువ డిజిటల్ చెల్లింపులు చేసే నగరాల్లో మన హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది.