బండి సంజయ్ పై కేటీఆర్ సెటైర్లు మామూలుగా లేవుగా...మోదీ వల్లే అవార్డు వచ్చిందంటూ.. - Telugu News - Mic tv
mictv telugu

బండి సంజయ్ పై కేటీఆర్ సెటైర్లు మామూలుగా లేవుగా…మోదీ వల్లే అవార్డు వచ్చిందంటూ..

March 13, 2023

ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఈ మూవీ ఆస్కారం సొంతం చేసుకుంది. దీంతో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు మూవీ టీంకు అభినందనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో బండి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను పోస్టు చేసి కామెంట్స్ చేస్తున్నారు.

నాటునాటు పాటకు ఆస్కార్ వరించడంపై చిత్ర టీంకు అభినందనలు తెలిపిన తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ గతంలో బండి సంజయ్ మాట్లాడిన ఓ వీడియో క్లిప్ ను పోస్టు చేశారు. చంద్రబోస్ రాసిన నాటునాటు పాట ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ ను గెలుచుకున్నందుకు త్రిబుల్ ఆర్ టీమ్ అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఈ మూవీపై మతోన్మాదులు ఎలాంటి విషం చిమ్మారో గుర్తుంచుకోవడానికి సరైన సమయమన్నారు. అలాంటి వ్యక్తులను తిరస్కరించాలన్నారు.

 

కొణతం దిలీప్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. బండిసంజయ్ పై సెటైర్లు వేశారు.
మోదీ వల్లే ఈ అవార్డు వచ్చిందని గొప్పలు చెప్పుకుంటాడు అంటూ ట్వీట్ చేశారు. అయితే కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిగ్గా మారింది. బీఆర్ఎస్ మద్దతుదారులు ఈ ట్వీట్ ను సమర్థిస్తూ కామెంట్స్ చేస్తుంటే…బీజేపీ మద్దతుదారులు నిప్పులు చెరుగుతున్నారు.