బీజేపీపై మరోసారి బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. మోదీని టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో మోడీ దేవుడూ అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ఎద్దేవ చేశారు. మోడీ ఎవరికి దేవుడు..? నీకా ? గుజరాత్ కా అంటూ ప్రశ్నించారు. “పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచినోడు, నల్ల చట్టాలు తెచ్చి రైతులను చంపినోడు దేవుడట..చేనేత మీద పన్నువేసినోడు దేవుడా ? “అంటూ కేటీఆర్ ఫైరయ్యారు. మహారాష్ట్ర-కర్ణాటక రాష్ట్రాల మధ్య గొడవను ఆపలేని మోడీ..రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపారా ? అంటూ సెటైర్లు వేశారు. సిరిసిల్ల విద్యుత్ సహకార సంస్థ పాలక వర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో కేటీఆర్ పై వ్యాఖ్యలు చేశారు.
సిరిసిల్ల సెస్ ఎన్నికలు ట్రైలర్ మాత్రమేనని..రాబోయే రోజుల్లో అసలైన సినిమా చూపిస్తామని కేటీఆర్ ఛాలెంజ్ విసిరారు. సెస్ ఎన్నికల సమయంలో బండి సంజయ్ రూ.5 కోట్లు తీసుకొచ్చి…తిరిగి డబ్బులు పంచామని బీఆర్ఎస్పైనే ఆరోపణలు చేశారని మండిపడ్డారు. సెస్‌లో గెలవనోడు..రాష్ట్రంలో గెలుస్తారా అని ప్రశ్నించారు. కేంద్రం నిధులపై తన సవాల్‌కు కట్టుబడి ఉన్నానని కేటీఆర్ స్పష్టం చేశారు. 14 మంది ప్రధానమంత్రులు చేసిన అప్పును మోడీ ఒక్కరే చేశారని ఆరోపించారు. కోవిడ్ సమయంలో కిషన్ రెడ్డి కుర్కురే ప్యాకెట్లు పంచడం తప్ప ఏంచేయలేదని విమర్శించారు కేటీఆర్.