KTR shared 20 year old photo in Twitter, KTR
mictv telugu

20ఏళ్ళ క్రితం ఫోటో షేర్ చేసిన కేటీఆర్

November 7, 2022

 

మాటల మాంత్రికుడు…ఇది జనరల్ గా రచయితలకు వాడే పదం కానీ ఈ పదం ఉపయోగించడానికి అన్ని హక్కులూ ఉన్న మంత్రి తెలంగాణలో కేటీఆర్ ఒక్కరే. సీఎం కేసీఆర్ కూడా బాగా మాట్లాడతారు. కానీ కేటీఆర్ ఇంకా అదరగొట్టేస్తారు. కేటీఆర్ బాగా చదువుకున్న వాడు, ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ మీద అంతా అవగాహన ఉన్నవాడు కావడం మూలాన ఏం మాట్లాడినా పెరఫక్ట్ గా ఉంటుంది.

మంత్రి కేటీఆర్ ఎప్పుడూ ట్విట్టర్‌లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారనే విషయం మనందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉండే పొలిటీషియన్లలో మంత్రి కేటీఆర్ అందరికంటే ముందు వరుసలో ఉంటారని అందరూ చెబుతూ ఉంటారు. ట్విట్టర్ లో జనంతో ఎప్పుడూ కనెక్టింగ్ లో ఉంటారు కేటీఆర్. వాళ్ళ సమస్యలను తెలసుకోవడమే కాదు, ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడంతో పాటు ప్రత్యర్థి పార్టీలకు కౌంటర్లు ఇస్తూ ఉంటారు. మోడీ, బీజేపీలను అయితే ఒక ఆట ఆడుకుంటుంటారు. రాజకీయ అంశాలకు సంబంధించినవే కాకుండా తన పర్సనల్ ఫొటోలు, విదేశీ టూర్లకు వెళ్లినప్పుడు అక్కడ దిగిన ఫొటోలను కేటీఆర్ అభిమానులతో తరుచుగా పంచుకుంటూ ఉంటారు.

ఈ రోజు కేటీఆర్ చేసిన ట్వీట్ ఒకటి వైరల్ అవుతోంది. తన 20 ఏళ్ళ క్రితం నాటి ఫోటో ఒకటి షేర్ చేశారు ఆయన. 2002లో అక్టోబర్ 26న దిగిన ఫొటోతో పాటు ఇప్పటి ఫొటోను కూడా షేర్ చేశారు. 20 ఏళ్ల క్రితం, ఇప్పుడు అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేటీఆర్ అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున లైకులు కొడుతూ రీట్వీట్ చేస్తున్నారు. బోలెడు కామెంట్లు కూడా పెడుతున్నారు. మీరు శారీరకంగా పెద్దవారైనట్లు కనిపిస్తున్నా.. మీ ఆలోచనలు మాత్రం ఎప్పుడూ డైనమిక్‌ అంటూ కామెంట్ చేస్తున్నారు.
యంగ్ లుక్ లో కేటీఆర్ భలే హ్యండ్సమ్ గా కనిపిస్తున్నారు. హీరోకి కావాల్సిన అన్ని క్వాలిటీలు ఉన్నాయనిపించేలా ఉన్నారు. ఈ విషయమే ఫాలోవర్స్ కూడా అంటున్నారు. రాజకీయాల్లోకి కాకుండా సినిమాల్లోకి హీరోగా వెళ్ళాల్సింది అంటూ పొగడ్తలలో ముంచెత్తుతున్నారు. అప్పుడూ, ఇప్పుడూ కూడా అందంగా ఉన్నారంటూ లైక్ లు కొడుతున్నారు. భవిష్యత్తులో కాబోయే ప్రధాని అంటూ కొంతమంది అభిమానులు కామెంట్ పెట్టారు. మరి కొంతమంది మునుగోడులో టీఆర్ఎస్ గెలిచినందుకు అభినందనలు చెబుతున్నారు.