KTR speech in ambedkar open university
mictv telugu

నా పేరుతో కొట్టుకు చావండని ఏ దేవుడు చెప్పిండు : కేటీఆర్

August 27, 2022

తెలంగాణలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మతాల పేరుతో కొట్టుకు చావమని ఏ దేవుడు చెప్పాడంటూ ప్రశ్నించారు. మన దేశంలో తిండి, నీరు లేక చాలా మంది అల్లాడుతున్నారని, వాటి గురించి ఆలోచించడం మానేసి అనవసర విషయాలపై ఎందుకు దృష్టిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాముడు, కృష్ణుడు, జీసస్, అల్లాలలో ఎవరైనా ఇతర మతాల వారిని చంపమని చెప్పారా? అని సూటిగా నిలదీశారు. ‘నాకు మా అమ్మ గొప్పు, మీకు మీ అమ్మ గొప్ప. అంతేకానీ, మా అమ్మనే గొప్ప.. మీ అమ్మ కాదు అని వాదులాడుకోవడంలో అర్ధం ఉందా. 8 ఏళ్లలో ఏం సాధించారని అడుగుతున్నారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా 2.22 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాం. అందరికీ ప్రభుత్వ ఉద్యోగం సాధ్యం కాదు కాబట్టి, ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తున్నాం. జల సంరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా మారింది. సిరిసిల్ల ప్రజలు ఐఏఎస్ ఆఫీసర్లకే పాఠాలు చెప్పే స్థాయికి వెళ్లారు. దేశ జనాభాలో కేవలం రెండున్నర శాతం ఉన్న తెలంగాణ జీడీపీలో మాత్రం 5 శాతం అందిస్తోంది. ఈ 8 ఏళ్లలో కేంద్రం ఒక్క విద్యాసంస్థను కూడా తెలంగాణకు కేటాయించలేదు. ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వచ్చి మాపై విమర్శలు చేస్తున్నారు. ముందు వాళ్లేమి ఇచ్చారో తెలుసుకుంటే బాగుంటుంది’ అని ముగించారు.