ట్రాఫిక్ లో కేటీఆర్..! షేక్ హ్యాండ్ ,సెల్ఫీల కోసం జనం ఆరాటం...! - MicTv.in - Telugu News
mictv telugu

ట్రాఫిక్ లో కేటీఆర్..! షేక్ హ్యాండ్ ,సెల్ఫీల కోసం జనం ఆరాటం…!

August 10, 2017

రాం సాగర్ ప్రాజెక్ట్ పునరుజ్జీవన కార్యక్రమానికి బయలుదేరిన కేటీఆర్..ఆర్మూర్ ప్రాంతంలో రెండు గంటలకు పైగా  ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారు, సభకు వెళ్లే వందలాది వాహనాలు కదలక పోవడంతో ముందుకు కదలని మంత్రి వాహనము.అక్కడున్న జనమంతా కేటీఆర్ వాహనం చుట్టూ ఒక్కసారిగా గుమిగూడారు.సార్ ప్లీజ్ ఒక్క షేక్ హ్యాండ్,ఒక్క సెల్ఫీ అంటూ జనం కోరడంతో.. కేటీఆర్ వాహనం డోర్ తీస్కొని అందరిని పలకరిస్తూ,కొందరికి షేక్ హ్యాండ్ ఇస్తూ,మరికొందరితో సెల్ఫీలు కూడా దిగారు.