Ktr suffering from covid second time
mictv telugu

కేటీఆర్‌కు మళ్లీ కరోనా.. ఇప్పటికే కాలి గాయం..

August 30, 2022

Ktr suffering from covid second time

కాలి గాయం నుంచి కోలుకుంటున్న తెలంగాణ మంత్రి కేటీఆర్ మళ్లీ కరోనా బారిన పడ్డారు. వ్యాధి లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్ ఫలితం వచ్చిందని ఆయనే స్వయంగా వెల్లడించారు.

ప్రస్తుతం తను ఇంట్లోనే క్వారంటైన్ అయ్యాయనన్న ఆయన, ‘‘ఇటీవల కొన్నాళ్లుగా తనను కలుసుకున్న వారు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలి,’’ అని కోరారు. మనకు కరోనా ప్రమాదం ఇంకా తొలగలేదని ట్వీట్ చేశారు. కేటీఆర్ గతేడాది ఏప్రిల్‌లో తొలిసారి కరోనా బారినపడ్డారు. సీఎం కేసీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ సహా పలువురు మంత్రులకు కరోనా సోకింది. కేటీఆర్ ఇటీవల హైదరాబాద్ మహీంద్ర యూనివర్సిటీ స్నాతకోత్సవం వెళ్లినప్పుడు ఎడమకాలికి గాయమైంది.