అవార్డ్ అందుకున్న కేటీఆర్...! - MicTv.in - Telugu News
mictv telugu

అవార్డ్ అందుకున్న కేటీఆర్…!

September 9, 2017

తెలంగాణ ఐటి శాఖమంత్రి కేటీఆర్ ఢిల్లీ లో  ’ఐటి మినిస్టర్  ఆఫ్ ది ఇయర్’ అవార్డును  అందుకున్నారు. 49వ స్కోచ్ సమ్మిట్ లో పాల్గొన్న ఆయన.. మాట్లాడుతూ ’తాను ఐటీ మంత్రిగా రాష్టంలో చేపట్టిన పలు కార్యక్రమాలే ’ ఐటీ మినిస్టర్ అఫ్ ది ఇయర్’ గా ఎంపిక చేశాయన్నారు’. స్కోచ్ సంస్థ చైర్మన్ సమీర్ కొచ్చార్ మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్‌ను పలు సందర్భాల్లో దగ్గరగా గమనించాం.  పలు అంశాలపై ఆయన సృజనాత్మకంగా స్పందించిన తీరు ఆకట్టుకుంది. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలను సఫలంచేసే రీతిలో మంత్రి కేటీఆర్ ముందుకు సాగుతున్నారు.  ఐటీ రంగ విశేష వృద్ధికోసం ఆయన పనిచేస్తున్న తీరు నూతన భారతంకోసం కొత్త రాష్ర్టాన్ని తీర్చిదిద్దుతున్నట్లుగా ఉంది  అని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వ పథకాలను నిశితంగా గమనించడం తోపాటు పలువురు అధ్యయనవేత్తలతో కూడిన బృందం వాటిని విశ్లేషించడం, భాగస్వామ్యం పక్షాలతో చర్చించడం, స్కోచ్‌కు అంతర్గత బృందం ఇచ్చిన నివేదికల ఆధారంగా ఈ అవార్డుకు  కేటీఆర్ ను ఎంపిక చేసినట్లు చెప్పారు.