వరంగల్ అభివృద్ధిపై కేటిఆర్ కన్ను - MicTv.in - Telugu News
mictv telugu

వరంగల్ అభివృద్ధిపై కేటిఆర్ కన్ను

August 21, 2017

తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక జిల్లాగా ప్రభుత్వ దృష్ఠని ఆకట్టుకుంటోంది వరంగల్ జిల్లా. కాకతీయులు ఏలిన జిల్లాగా వరంగల్ కు ప్రత్యేక ఆకర్షణ వుంది. అందుకోనేమో లీడర్లు ఎక్కువగా వరంగల్ వైపే చూపు సారిస్తుంటారు. తాజాగావరంగల్ నగర అభివృద్ధి పనులపైన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మరియు మంత్రి కెటి రామారావు.

వరంగల్ పట్టణ అభివృద్ధి కార్యక్రమాల అమలు పైన మంత్రి కేటీ రామారావు ప్రత్యేక దృష్టి సారించారు. ఈరోజు ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆధ్వర్యంలో వరంగల్ జంట జిల్లాల ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు మంత్రితో బేగంపేట క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. వరంగల్ లో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిని, పెండింగ్ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొని వచ్చారు. త్వరలోనే వరంగల్లులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నట్లు, ఇందుకోసం ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటిస్తారని మంత్రి కేటీ రామారావు తెలియజేశారు.

ఈ పర్యటనలో వరంగల్ టెక్స్ టైల్ పార్క్ శంకుస్థాపన చేసేందుకు తమ శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రజా ప్రతినిధులకు మంత్రి తెలియజేశారు. ప్రభుత్వం వరంగల్ నగరానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నదని, ఇందుకోసం కార్పొరేషన్కు ప్రత్యేక నిధులను ఇచ్చిందని తెలియజేశారు. వరంగల్ నగరంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఆశించిన మేర మార్పు తీసుకొని వచ్చేందుకు చేపట్టాల్సిన చర్యలపైనా, ప్రణాళికల పైన చర్చించేందుకు వరంగల్ నగరంలో ప్రత్యేకంగా పురపాలక శాఖ తరఫున ఒకరోజు సమీక్ష నిర్వహించాలని మంత్రిని జిల్లా ప్రజా ప్రతినిధులు కోరారు. ఈ సమీక్షా సమావేశంలో నాటికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సారథ్యంలో వివిధ అంశాల పైన చర్చించి ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపుతామని తెలియజేశారు. వచ్చేవారం వరంగల్ లో నిర్వహించే ఈ సమీక్ష సమావేశానికి పురపాలకశాఖ ఉన్నతాధికారులతో పాటు జిల్లాస్థాయి యంత్రాంగం మొత్తం పాల్గొంటుందని మంత్రి తెలియజేశారు. ఈ సమీక్ష సమావేశంలో వరంగల్ కార్పొరేషన్, కూడా అభివృద్ధి పనులను సమీక్షిస్తారు.