గల్లచొక్కా కుర్రాణ్ని గుర్తుపట్టారా?  - MicTv.in - Telugu News
mictv telugu

గల్లచొక్కా కుర్రాణ్ని గుర్తుపట్టారా? 

September 5, 2017

గల్ల చొక్కాతో , మీసం కట్టుతో ఉన్న కుర్రాణ్ని గుర్తుపట్టార? బాగా చూడండి.. గుర్తుకు రావడం లేదా? ఆయన ఎవరో కాదు,  ప్రస్తుత తెలంగాణ  ఐటి మంత్రి కేటీఆర్. 22 ఏండ్ల క్రితం ఫోటో ఇది. 1995 లో తన స్నేహితులతో  దిగిన ఫోటోనట . ఇగో 1995 లో నా ఫ్రెండ్స్ తో దిగిన ఫోటో ఇది.. ఇప్పుడే మాదోస్తు పంపిండు అని  ట్టిట్టర్ల  పోస్ట్ జేశిండు కేటీఆర్. కనీ  దోస్తు  పంపిన గీ పోట్వ సూడంగనే  రయ్యి రయ్యి మని  ఎంబటే  పాత జ్ఝాపకాలకు  వెళ్లిండు గావచ్చు కేటీఆర్ సారు. మరి పోటోలకున్న పవర్ అదేనాయే…పాత జ్జాపకాలను  భద్రంగా భద్రపరుస్తదని అందరం ఆనందంల ఉన్నప్పుడు , పోట్వలు దిగెటోళ్లం. పండగలకు, పబ్బలాకు మంచిగ తయారయ్యి  ఫోటో స్టూడియోకొయ్య పోట్వ దిగెటోళ్లం. కనీ గిప్పుడు  పరిస్థితి గట్లున్నదా.. ! ఎవ్వల చేతులల్ల జూసిన  చాటలెక్క పెద్ద పెద్ద ఫోన్లాయే . పాశి మొహంతోని సెల్ఫీ, కుసుంటె సెల్ఫీ ,నిల్సుంటే సెల్ఫీ, తింటుంటే సెల్ఫీ అని  పోట్వలకు  విలువలేకుంట జేశ్నం. ఏం జేస్తం అంత టెక్నాలజీ పుణ్యం మరి.