మట్టి గణపతిగా ఓ మనిషి..  - MicTv.in - Telugu News
mictv telugu

 మట్టి గణపతిగా ఓ మనిషి.. 

August 24, 2017

సూస్తుంటే మట్టి గణపతిని బండిమీద వెట్టి తీస్కపోతున్నట్టు అన్పిస్తుంది కదా. కనీ బండి మీద కూసుంది మట్టి గణపతి కాదు.. మనిషే. మహబూబాబాద్ జిల్లాలో గత నాలుగేండ్లుగ మహమ్మద్ సుబాని, సలీమాలు  ‘మట్టి గణపతిని  వాడండి’ అంటూ ఇలా వినూత్న ప్రచారం మొదలు పెట్టారు. ఒళ్ళంతా మట్టి పూసుకుని, వినాయకుడి తల తగిలించుకుని  ఇట్ల గల్లీలన్నీ తిర్గి మట్టి గణపతి కోసం ప్రచారం చేస్తున్నారు. మట్టి గణపితిని పూజిద్దాం,పర్యావరణాన్ని రక్షిద్దాం అని  ప్రచారం చేస్తున్నారు.

ముస్లింలు అయి ఉండికూడా  హిందూ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ, మట్టి గణపతినే  పూజించండంటూ ఇలా ప్రచారం చేస్తున్నందుకు ఈ ఫోటో ట్విటర్ లో పెట్టి మంత్రి  కేటీఆర్  వాళ్ళను అభినందించారు.