చిన్నారి లేఖకు స్పందించిన కేటీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

చిన్నారి లేఖకు స్పందించిన కేటీఆర్

February 19, 2018

ఓ చిన్నారి లేఖకు తెలంగాణ ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఫిదా అయ్యారు. ఆ పాప రాసిన లేఖను ట్విటర్‌లో షేర్ చేశారు. ఆ చిన్నారి కోరికను తీరుస్తానని హామీ ఇచ్చారు. ‘నేను సుప్రియని. నా వయసు ఆరు సంవత్సరాలు. ఆల్వాల్ హిల్స్‌లోని సెయింట్ పయాస్ టెన్త్ పాఠశాల‌లో ఒకటో తరగతి చదువుకుంటున్నాను. సుచిత్రా జంక్షన్ వద్ద  కొందరు పిల్లలు భిక్షాటన చేస్తున్నారు. వారికి ఉండేందుకు ఇల్లు, ఆహారం, విద్యను అందించాలని నేను కోరుకుంటున్నాను. ఇందుకోసం నా కిడ్డీ బ్యాంకులో దాచుకున్న 2000 రూపాయలను మిమ్మల్ని కలిసి ఇస్తాను’ అని రాసింది సుప్రియ.ఆ చిన్నారి తండ్రి నాగేశ్వరరావు కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ, లేఖను  ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆ లెటర్‌ను చూసిన కేటీఆర్ స్పందించారు. ‘మీ పాపకు నా తరఫున థ్యాంక్స్ చెప్పాలని, మీ పాప ప్రస్తావించిన చిన్న పిల్లల పట్ల తప్పకుండా శ్రద్ధ తీసుకుంటాను’ అని  కేటీఆర్ చెప్పారు. ఇక ఆ పాప తన కిడ్డీ బ్యాంకు సేవింగ్స్‌ను ఇస్తానని చెప్పడం ఆ పాప మంచి మనసును సూచిస్తోందని వ్యాఖ్యానించారు.