మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా సొంత ఖర్చులతో నానమ్మ జ్ఞాపకార్ధం పాఠశాలను నిర్మించనున్నట్టు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలోని కోనాపూర్ గ్రామంలో ఆయన మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా పై వాగ్ధానం ఇవ్వడంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేశారు. అనంతరం కేటీఆర్ తన పూర్వీకులను గుర్తు చేసుకున్నారు. తన తండ్రి వందల ఎకరాలున్న కుటుంబంలో పుట్టారనీ, వ్యవసాయ పొలంలో ఇల్లు కట్టుకున్నందుకు ఫాంహౌజ్ సీఎం అంటున్నారని వెల్లడించారు. పొలంలో ఇల్లు కట్టుకోవడం తప్పా? అని ప్రశ్నించారు. అనంతరం తమ పూర్వీకులు నివసించిన ఇంటిని కేటీఆర్ పరామర్శించారు.
మంత్రి @KTRTRS గారి నాయనమ్మ శ్రీమతి వెంకటమ్మ గారి స్మారకార్ధం వారి గ్రామమైన కామారెడ్డి జిల్లాలోని కోనాపూర్ లో ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో భాగంగా తన వ్యక్తిగత నిధులతో నిర్మించే నూతన ప్రభుత్వ పాఠశాల భవనానికి శంకుస్థాపన చేశారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. pic.twitter.com/znlRWg1XJU
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 10, 2022