కాంగ్రెస్ ఖాతాను బ్లాక్ చేసిన కేటీఆర్.. రేవంత్ సెటైర్ - MicTv.in - Telugu News
mictv telugu

కాంగ్రెస్ ఖాతాను బ్లాక్ చేసిన కేటీఆర్.. రేవంత్ సెటైర్

May 6, 2022

”ట్విట్టర్ పిట్ట తోకముడిచింది. ప్రశ్నను చూసి గజగజ వణికింది. ప్రజల తరపున అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌ను కేటీఆర్ బ్లాక్ చేశారు. ఒక జాతీయ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్‌ను బ్లాక్ చేయడం కేటీఆర్ మానసిక స్థితికి అద్దం పడుతోంది” అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేటీఆర్‌పై సెటైర్లు వేశారు. ప్ర‌జ‌ల త‌ర‌ఫున‌ తాము అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేక దెబ్బకు కాంగ్రెస్ ఖాతాను బ్లాక్ చేశారంటూ ట్విటర్ వేదికగా తెలిపారు. కేటీఆర్ నిర్ణ‌యంపై కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు తెగ ట్రోల్ చేస్తున్నారు.’ కాంగ్రెస్ చెప్పిన మాట నిజ‌మే. ఆ పార్టీ అడిగే ప్ర‌శ్న‌ల‌కు బ‌దులివ్వ‌లేకే కేటీఆర్ ఆ పార్టీ ట్విట్ట‌ర్‌ను బ్లాక్ చేశారు’ అంటూ తెగ పోస్టులు పెడుతున్నారు.

 

మరోపక్క రాహుల్ గాంధీ మరికొద్ది గంటల్లో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రానున్నారు. అక్కడి నుంచి వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన ‘రైతు సంఘర్షణ’ సభకు హాజరుకానున్నారు. ఇప్పటికే సభకు సంబంధించిన ఏర్పాటు అన్నీ పూర్తి అయ్యాయి. ఈ క్రమంలో కొన్ని రోజలుగా టీఆర్ఎస్ నాయకుల మధ్య కాంగ్రెస్ నాయకుల మధ్య ట్విటర్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. దీనికి తోడు ఈరోజు కేటీఆర్ కాంగ్రెస్ ట్విటర్ ఖాతాను బ్లాక్ చేయడంతో టీఆర్ఎస్‌ నాయకులపై విమర్శలు గుప్పిస్తున్నారు.