ఆదివారం ఇలా.. ప్రగతి భవన్‌లో పారిశుద్య పనులు చేసిన కేటీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

ఆదివారం ఇలా.. ప్రగతి భవన్‌లో పారిశుద్య పనులు చేసిన కేటీఆర్

May 24, 2020

KTR

‘ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు’ అంటూ తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ పిలుపు మేరకు తానే స్వయంగా ముందు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో కేటీఆర్ ఇవాళ ప్రగతి భవన్‌లో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రగతి భవన్‌లో ఉన్న ఓ తొట్టెలో మురుగు నీరు నిల్వ ఉండడాన్ని గుర్తించి శుభ్రం చేశారు. పలు కుండీల్లో చెత్తను శుభ్రం చేశారు. 

అలాగే ప్రగతి భవన్ ప్రాంగణంలోని చెత్తను కూడా మొత్తం ఏరివేశారు. ఇందుకు  సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలావుండగా, కేటీఆర్ పిలుపు మేరకు మంత్రులు, ఇతరు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించి, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. సీజనల్ వ్యాధుల నివారణే ప్రధాన ఉద్దేశంగా ఈ కార్యక్రమం చేపట్టారు. కాగా, కేటీఆర్ చేసిన మంచి పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇలా ప్రతీ ఒక్కరు తమ పరిసరాలను శుభ్రం చేసుకుంటే ఎలాంటి సీజనల్ వ్యాధులు దరిచేరవు అని అంటున్నారు.