'సైరా'కు నో చెప్పిన మంత్రి కేటీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

‘సైరా’కు నో చెప్పిన మంత్రి కేటీఆర్

September 13, 2019

మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక సైరా మూవీ ప్రిరిలీజ్ ఈవెంట్‌ హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో ఈ నెల 18న జరుగనుంది. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా కావడంతో అందుకు తగ్గట్లే ఎల్‌బీ స్టేడియంలో భారీ సెట్‌ వేసేందుకు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సన్నాహాలు చేస్తుంది.

ఈ కార్యక్రమానికి విచ్చేయనున్న అతిథులకు సంబంధించి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ట్విట్ చేస్తూ స్పష్టత ఇచ్చింది. తెలంగాణ మంత్రి కేటీఆర్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, దర్శకులు రాజమౌళి, శివ కొరటాల, వివి వినాయక్ ముఖ్య అతిథులగా హాజరవుతారని తెలిపింది. ఐతే ఈ ప్రకటన చేసిన కాసేపటికే మరో ప్రకటన చేశారు. సైరా ప్రిరిలీజ్ కార్యక్రమానికి కేటీఆర్ హాజరుకావడం లేదని వెల్లడించారు. ముందుగానే నిర్ణయించబడిన ప్రభుత్వ అధికార కార్యక్రమాలకు వెళ్లాల్సిన ఉన్నందున ఆయన రావడం లేదని తెలిపారు. సైరా మూవీలో చిరంజీవితో పాటు అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి, నయన తార, అనుష్క, తమన్నా నటిస్తున్నారు. అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల కాబోతుంది.