KTR work from home shuru..photo viral
mictv telugu

కేటీఆర్‌ వర్క్‌ఫ్రమ్‌ హోం షురూ..ఫోటో వైరల్

July 27, 2022

తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వర్క్ ఫ్రమ్ హూం షురూ చేశారంటూ నెట్టింట తెగ చర్చ జరుగుతోంది. ట్విటర్‌లో కేటీఆర్ పోస్టు చేసిన ఓ ఫోటోపై నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ‘కేటీఆర్ సారూ..వర్క్ ఫ్రమ్ హూం షురూ చేశారు ఈ ఫోటోను చూడండి’ అంటూ కేటీఆర్‌పై ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు.

తాజాగా కేటీఆర్ గాయపడిన విషయం తెలిసిందే. దీంతో పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఎడమ కాలి చీలమండ కండరానికి గాయం కావడంతో మూడు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు సూచించారు. దాంతో కేటీఆర్ ఇంట్లోనే ఉంటూ, ఎప్పటికప్పుడు తన కార్యకలపాలను ట్విటర్ వేదికగా పంచుకుంటున్నారు. మంగళవారం తన విభాగం ఫైల్స్‌ను చూస్తున్న ఓ ఫొటోను కేటీఆర్..ట్విట్టర్లో షేర్‌ చేశారు. వర్క్‌ఫ్రమ్‌ హోంలోనూ కొన్ని ఫైళ్లకు సంబంధించిన పని జరుగుతోందంటూ క్యాపన్ష్ పెట్టారు. దాంతో నెటిజన్స్, ఆయన అభిమానులు కేటీఆర్‌ చేస్తున్న వర్క్ ఫ్రమ్ హోంపై తమ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలుపుతూ, ఫోటోను తెగ షేర్ చేస్తున్నారు. మరోపక్క కేటీఆర్‌ను.. కొన్ని వెబ్ సరీస్‌ల యాజమాన్యాలు, నెటిజన్స్ మంచి సినిమాలను చూడాలంటూ రిఫర్‌ చేస్తున్నారు.