కేటీఆర్ మెచ్చిండు...ట్విట్టర్లో పెట్టిండు ! - MicTv.in - Telugu News
mictv telugu

కేటీఆర్ మెచ్చిండు…ట్విట్టర్లో పెట్టిండు !

July 27, 2017

ఐటి శాఖా మంత్రి కేటీఆర్..తన ట్విట్టర్లో ఫిదా సిన్మమీద ప్రశంసలు కురిపించారు..తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన అందమైన ప్రేమకథా చిత్రం నన్ను ఫిదా చేసిందని అన్నారు,ఫిదా వంటి మంచి చిత్రాన్ని తీసిన డైరెక్టర్ శేఖర్ కమ్ములకి ప్రత్యేక అభినందనలు తెలిపారు.మొన్ననే  సియం కేసిఆర్ సారు గుడ ఫిదాని చూసి ఫిదా టీమ్ ని అభినందించారు.

ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలోని పరిసరాలు…సాయిపల్లవి(భానుమతి) తన వాయిస్ తో తెలంగాణ భాషను పలికిన విధానం అందరిని ఫిదా చేస్తుంది.నిజామాబాద్ దగ్గరున్న బాన్సువాడ పరిసర ప్రాంతలలో ఈ ఫిదా సిన్మాను తెరకెక్కించడం విశేషం.