తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌కు గవర్నర్ నరసింహన్ వండర్ ఫుల్ గిఫ్ట్ ఇచ్చారు. కేటీఆర్ పుట్టినరోజు కావడంతో రాజ్‌భవన్ నుంచి గ్రీటింగ్ పంపించారు. గ్రీటింగ్‌తో పాటు అద్భుతమైన పూల మొక్కను పంపారు. ఇలాంటి పుట్టినరోజులను మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తున్నానని. ఎల్లప్పుడూ సుఖ, సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నానని గ్రీటింగ్ కార్డులో గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. అద్భుతమైన బహుమానాన్ని పంపించిన గవర్నర్‌కు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. హరితహారం అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు.