మంత్రి కేటీఆర్ గాల్లో తేలినట్టుందే…సాంగేసుకోకపోయినా..ఆ పాటను గుర్తు చేశారు. రోప్ వేపై ఆయన ప్రయాణించారు. మహబూబ్ నగర్ జిల్లాలోని మయూరీ నర్సరీలో అడ్వెంచర్ పార్క్‌ను కేటీఆర్ ప్రారంభించారు. రోప్ వేపై మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ప్రయాణించి ఎంజాయ్ చేశారు. అంతకుముందు నర్సరీలో మంత్రులు మొక్కలు నాటి అర్బన్ లంగ్ స్పేస్ పార్క్‌ను ఓపెన్ చేశారు. ఇక మహబూబ్‌నగర్ న్యూటౌన్ నుంచి రైల్వేష్టేషన్ వరకు సీసీ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు.