KTR's himanshu son says Balayya's dialogue
mictv telugu

బాలయ్య డైలాగ్‌తో అదరగొట్టిన కేటీఆర్ కొడుకు..

November 15, 2022

లావుగా బొద్దుగా కనిపించే కేటీఆర్ తనయుడు హిమాన్షు ఇప్పుడు చాలా స్లిమ్‌గా మారిపోయాడు. అస్సలు గుర్తుపట్టరానంతగా తగ్గిపోయాడు. ఈ క్రమంలో తాజాగా కొత్త లుక్‌లో సోషల్ మీడియా వేదికగా ఫోటో పెట్టి అందరికీ షాకిచ్చాడు. దీనిని చూసిన ఓ నెటిజన్ ‘సడెన్‎గా చూసి కేటీఆర్ అనుకున్నా’ అంటూ కామెంట్ పెట్టాడు. దీనిపై హిమాన్షు బాలయ్య డైలాగ్‌తో ఇచ్చిన రిప్లై అదిరిపోయింది. ’సర్‌సర్లే ఎన్నెన్నో అనుకుంటా‘..అన్ని జరుగుతాయా ఏంటి? జోకులు పక్కన పెడితే… థ్యాంక్యూ’ అంటూ హిమాన్ష్ జవాబిచ్చాడు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.

నిజానికి హిమాన్షు గతంలో చాలా లావుగా ఉండేవాడు. దీనిపై ప్రతిపక్షాలు అతనిని బాడీషేమింగ్ కూడా చేసాయి. దీనిపై ఒకసారి కేటీఆర్ కూడా స్పందించారు. తనను కొడుకుని బాడీ షేమింగ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు అలాంటి వారందరికీ షాక్ ఇచ్చేలా హిమాన్షు మారిపోయాడు. తక్కువ సమయంలో బాగా స్లిమ్ అయ్యి కొత్త లుక్‌తో అదరగొడుతున్నాడు.