మంత్రి కేటీఆర్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన మామ హరినాథరావు బుధవారం రాత్రి 8.30 గంటలకు గుండెపోటుతో మరణించారు. మంగళవారం సాయంత్రం హార్ట్ ఎటాక్ రావడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించగా, బుధవారం ఆరోగ్యం క్షీణించి మరణించినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. దీంతో కేటీఆర్ తన సతీమణి శైలిమతో కలిసి ఆస్పత్రికి వెళ్లారు. అటు హరినాథరావు భౌతికకాయాన్ని రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్ లో ఉన్న ఆయన నివాసానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ గురువారం ఉదయం ఆయన నివాసానికి చేరుకుని నివాళులు అర్పించనున్నారు. హరినాథరావు మరణం పట్ల పలువురు రాజకీయ నాయకులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.