లూట్,జూట్,స్కూట్…కేటీఆర్ చెప్పిన కథ..!
లూట్, జూట్, స్కూట్
ఇది కాంగ్రెస్ పార్టీ కొత్త సిద్దాంతం అట,ఇది అన్నది ఎవరో కాదు తెలంగాణ ఐటి శాఖామంత్రి కేటీ రామారావు.కాంగ్రెస్ పార్టీ విమర్శలను కౌంటర్ చెయడానికి పెట్టిన ప్రెస్ మీట్ లో లూట్,జూట్,స్కూట్ సిద్దాంతం గురించి కేటీఆర్ వివరించారు.ఇంతకీ ఆయన దృష్టిలో లూట్,జూట్,స్కూట్ అంటే ఏమిటి?
లూట్ అంటే దోచుకోవడం, గతంలో కాంగ్రెస్ పరిపాలన చేసిన కాలమంతా దోచుకోవడానికే సరిపోయిందని కేటీఆర్ ఉధ్దేశ్యం.
జూట్ అంటే అబద్ధాలు, కాంగ్రెస్ పార్టీ దాని నాయకత్వం కేవలం అబద్ధాలు మీదనే రాజకీయం చేస్తుందనేది కేటీఆర్ ఉద్దేశ్యం.బట్ట కాల్చి మీదేయడం కాంగ్రెస పార్టీకి తెలిసిన విద్యే అని కేటీఆర్ అన్నారు.
స్కూట్ అంటే పారిపోవడం, కాంగ్రెస్ పార్టీ టిఆర్ ఎస్ మీద చేసిన ఆరోపణలపై చర్చకు రావాలంటే కాంగ్రెస్ పార్టీ తోక ముడిచి పారిపోతుందని కేటీఆర్ అన్నారు.
మొత్తం మీద తనదైన ప్రాసతో కేటీఆర్ కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ బాగానే ఇచ్చాడు,అయితే కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎట్లా ఎదుర్కుంటుందో చూడాలి.