కరోనా భయమే లేదు.. వస్త్ర దుకాణంలోకి ఎగబడిన జనం,సీజ్  - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా భయమే లేదు.. వస్త్ర దుకాణంలోకి ఎగబడిన జనం,సీజ్ 

October 20, 2020

 Kumaran Silks

పండుగల సీజన్ వచ్చిందంటే చాలు జనంతో వస్త్ర దుకాణాలు కళకళలాడిపోతాయి. ఈ సీజన్‌లోనే చాలా మంది షాపింగ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా దసర, దీపావళి సందర్భంగా వీపరీతమైన జనం వస్తారు. ఈ ఏడాది కరోణా కారణంగా చాలా కాలం పాటు దుకాణాలు అన్ని మూతపడే ఉన్నాయి. ఇటీవలే తెరుచుకోవడం, దసరా పండగ కూడా రావడంతో జనం ఎగబడుతున్నారు. ఎక్కడ చూసినా కరోనా నిబంధనలు కూడా గాలికి వదిలేసి దుస్తులు కొనుగోలు చేస్తున్నారు. చెన్నైలో ఇలాగే షాపులోకి జనం గుంపులు గుంపులుగా చేరడంతో అధికారులు దాన్ని సీజ్ చేశారు. కేసు నమోదు చేసి నోటీసులు పంపించారు. 

చెన్నై త్యాగరాయనగర్‌లో ఉన్న కుమారన్ సిల్క్స్ షాపింగ్ మాల్‌కు మంచి ఆధరణ ఉంటుంది. పండగ సీజన్‌లో దాంట్లో జాతర వాతావరణం కనిపిస్తుంది. ఈసారి కూడా జనం అలాగే ఎగబడ్డారు. కనీసం కరోనా అనే భయం కూడా లేకుండా భౌతికదూరం సంగతి మర్చిపోయారు. ముఖాలకు మాస్కులు కూడా లేకుండా వచ్చారు. ఈ సమాచారం అందుకున్న చెన్నై కార్పొరేషన్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించడంతో కుమారన్ సిల్క్స్ దుకాణానికి సీల్ వేశారు.