డబుల్ పీజీ చేసి భిక్షాటన చేస్తున్న విద్యార్థి నాయకురాలు - MicTv.in - Telugu News
mictv telugu

డబుల్ పీజీ చేసి భిక్షాటన చేస్తున్న విద్యార్థి నాయకురాలు

October 20, 2020

Double PG

బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవుతూ ఉంటాయనే సామెత అందరికి తెలిసిందే. ఎప్పుడు ఎవరి జీవితం ఎలా మలుపు తిరుగుతుందో ఊహించడం చాలా కష్టం. అలాంటిదే ఓ మహిళకు ఎదరైంది. ఒకప్పుడు యూనివర్సిటీలో ఫైర్ బ్రాండ్, రెండు సార్లు ఎన్నికల్లో పోటీ చేసిన ఆమె ఇప్పుడు యాచకురాలిగా మారిపోయింది. వీధి వీధి తిరుగుతూ భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. ఉత్తరాఖండ్‌లోని హన్సీ ప్రహరి అనే మహిళ ఈ ధీన స్థితిని ఎదుర్కొంటోంది.

అల్మోరా జిల్లా సోమేశ్వర్ కు సమీపాన ఉండే రాంఖిలా గ్రామానికి చెందిన హన్సీ ప్రహరి  కుమావున్ యూనివర్సిటీలో పేరు మార్మోగేది. చిన్నప్పటి నుంచే ఎంతో చురుగ్గా ఉంటూ కష్టపడి చదివింది. ఆ తర్వాత యూనివర్సిటిలో ఉన్నత విద్యా కోసం చేసింది.  ఆమె ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడుతుంటే ప్రసంగం వినడానికి చాలా మంది విద్యార్థులు సభకు వచ్చేవారు. డబుల్ పీజీ చేసి విద్యార్థి నాయకురాలిగా ఎదిగింది. ఎన్నో సమస్యలపై పోరాటాలు చేసి, ఆనాటి ఉపరాష్ట్రపతి దృష్టిలో కూడా పడింది. ఆమె హాజరుకాకుండా ఎలాంటి మీటింగులు కూడా జరిగేవి కావు. విద్యార్థి సంఘం ఉపాధ్యక్షురాలిగా కూడా పని చేసింది.  కానీ జీవిత చదరంగం పూర్తిగా మలుపు తిప్పింది.  ఎంతో కష్టపడి పేద కుటుంబం నుంచి ఎదిగి ఎంతో గుర్తింపు పొందిన ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. 

2011 తరువాత, హన్సీ ప్రహరి జీవితం అకస్మాత్తుగా మారిపోయింది. ప్రస్తుత ఎంపీ అజయ్‌ టమ్‌టాకు వ్యతిరేకంగా ఆమె గతంలో ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు. తర్వాత పెళ్లి చేసుకోవడం ఆమెను తీరని కష్టాల్లోకి నెట్టింది. పెళ్లి తర్వాత దంపతుల మధ్య గొడవల కారణంగా చిన్నాబిన్నమైంది. అప్పటి నుంచి, కుటుంబం నుంచి పూర్తిగా విడిపోయింది. తన కొడుకు తీసుకొని బయటకు వచ్చేసింది. కొంత కాలం ఉద్యోగం చేసిన తర్వాత ఆమెకు ఆరోగ్యం సహకరించకపోవడంతో పని మానేసింది. 2012 నుంచి తన ఆరేళ్ల బిడ్డతో కలిసి హరిద్వార్‌లో యాచించడం  మొదలుపెట్టింది. అలా వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తోంది. తనకు సాయం చేయాలని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ స్పందించలేదు. ఒకప్పుడు ఎంతో ప్రతిభను చాటుకున్న ఆమె ఇప్పుడు ఈ పరిస్థితిలోకి రావడం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. 

 

…………………………………………………………………………………………..

 

స్లగ్స్ : 

 

విద్యార్థి సంఘం నాయకురాలు జీవితం మారిపోయింది

యూచకురాలిగా మారి వీధుల్లో భిక్షాటన

ఉత్తరాఖండ్‌లోని హన్సీ ప్రహరి మహిళ ధీనగాధ

కుమావున్ యూనివర్సిటీలో ఆమె ఒక ఫైర్ బ్రాండ్

హన్సీ లేకుండా ఏ సభ జరిగేది కాదు

మాజీ కేంద్ర మంత్రి అజయ్ టామ్‌టాపై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ

ఓటమి తర్వాత పెళ్లి చేసుకున్న హన్సీ

జీవితాన్ని మార్చేసిన వివాహం

ఇంట్లో గొడవలతో వేరుపడిన మహిళ

2012 నుంచి హరిద్వార్‌లో భిక్షాటన

ప్రభుత్వాన్ని సాయం కోరినా ఫలితం శూన్యం