గుడ్డలూడదీసి నిలబెడతా..ఏపీ స్పీకర్‌కు మేనల్లుడి వార్నింగ్ - MicTv.in - Telugu News
mictv telugu

గుడ్డలూడదీసి నిలబెడతా..ఏపీ స్పీకర్‌కు మేనల్లుడి వార్నింగ్

November 8, 2019

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అగ్రిగోల్డ్ వ్యవహారంలో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. హాయ్‌ల్యాండ్ భూములను కొట్టేయాలని చంద్రబాబుతోపాటు మాజీ మంత్రి లోకేష్‌లు కుట్ర పన్నారని సీతారాం అన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు గుడ్డలూడదీస్తా అని పరుష పదజాలాన్ని ఉపయోగించారు. 30 ఏళ్ల అనుభవం ఉందన చెప్పుకుంటున్న బాబు దాన్ని మడిచి పెట్టుకోవాలని అసభ్య వ్యాఖ్యలు చేశారు. తప్పులన్నీ నిరూపితమయ్యాక ప్రజలందరి ముందు నిలబెట్టి గుడ్డలూడదీసి నిల్చోబెడతామని. దీంతో టీడీపీ నేతలు ఆయనపై  మండిపడుతున్నారు. 

Kuna ravikumar.

స్పీకర్ స్థాయిలో ఉండి ఒక పార్టీకి కొమ్ము కాస్తున్న ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. స్పీకర్‌కు దమ్ముంటే అగ్రిగోల్డ్ వ్యవహరంపై అసెంబ్లీలో చర్చపెట్టాలని  సవాల్ విసురుతున్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే, సీతారాం మేనల్లుడు కూన రవికుమార్ కూడా తీవ్రంగా స్పందించారు. స్పీకర్‌కు రాజకీయాలు చేయాలనే కోరిక ఉంటే రాజీనామా చేసి బయటకు రావాలన్నారు. ఆయన గురించి శ్రీకాకుళం జిల్లా ప్రజలకు తెలుసని, డాంబికాలు కొట్టడడంలో దిట్ట అని పేర్కోన్నారు. సీతారాం గుడ్డలు ఊడబీకి అముదాల వలసలో నిలబెడతామని హెచ్చరించారు. స్పీకర్‌గా ఉన్న వ్యక్తి ఎప్పుడు ఏ భాష మాట్లాడాలో తెలుసుకోవాలని అన్నారు. రాజ్యంగబద్దమైన పదవిలో ఉండి రాజకీయాలు మాట్లాడితే ప్రజలు క్షమించరని అన్నారు.