వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఏపీలోని ఓ జిల్లాకు చెందిన కలెక్టర్ కొడుకు ప్రభుత్వం నడిపే అంగన్వాడీ స్కూల్లో చదువుకుంటున్నాడు. తన ముద్దుల కుమారుడిని అంగన్ వాడి కేంద్రానికి పంపిస్తూ.. పదిమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఆ కలెక్టర్. వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు కలెక్టర్ కోటేశ్వరరావు… తన మూడేళ్ళ కొడుకు దివి ఆర్విన్ ను అంగన్వాడి స్కూల్ లో చదివిస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నారు. గత కొంత కాలంగా ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, తమ పిల్లలను ప్రభుత్వ స్కూల్ లోనే చదివించాలనే ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా వస్తుండటంతో కలెక్టర్ స్పందించారు.
నాలుగేళ్ళ చిన్నారి దివి ఆర్విన్ ను బుధవార పేట అంగన్వాడీ ప్రీ స్కూల్ లో చేర్పించారు జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు. దివి ఆర్విన్ అంగన్వాడీ కేంద్రంలో పిల్లలతో కూర్చుని రంగులు దిద్దుకుంటూ, ఆట వస్తువులతో ఎంతో సంతోషంగా ఆడుకుంటున్నాడు. కలెక్టర్ కుమారుడు తమ అంగన్వాడీలో చేరడం గర్వంగా ఉందని అక్కడ గ్రేడ్1 సూపర్వైజర్ అంటున్నారు. అర్విన్ ఉదయం 10 గంటలకు స్కూల్కు వచ్చి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఉంటున్నాడు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సదుపాయాలను ప్రజలందరూ ఉపయోగించుకోవాలని సామాన్యులకు తెలిసేలా తన కుమారుడినే బ్రాండ్ అంబాసిడర్గా చేశారని చెప్పుకుంటున్నారు.